ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ లో అవెంజర్స్ మూవీ చూసిన సంగతి విధితమే.
ఈ విషయం గురించి ఏపీ అపద్ధర్మ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తమ టీడీపీ సర్కారు అన్ని చూసుకుంటుందనే నమ్మకంతోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సినిమాకు వెళ్లారేమో అని సెటైర్ వేశారు ..
ఆయన ఇంకా మాట్లాడుతూ” ఏ రోజూ కూడా జగన్ ఆంధ్ర్తప్రదేశ్ రాష్ట్రంలో ఉండరు..తుఫాన్ సమయంలో విదేశాలకెళ్లడం ఏమిటని “ఆయన జగన్ ను సూటిగా ప్రశ్నించారు.అటు ఎన్నికల నిర్వాహాణ వేరు.ఇటు రాష్ట్ర పరిపాలన వేరని అధికారులు తెలుసుకొవాలని”ఆయన హితవు పలికారు.