తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో
మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు.
అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టడానికి సరిగ్గా పదిహేనేండ్ల కిందంటే 2004లో మొత్తం ఎనిమిది మంది సభ్యులతో వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ప్రారంభించారు. భారత్,పాకిస్థాన్,శ్రీలంక,మయన్మార్,బంగ్లాదేశ్ ,మాల్దీవ్స్ ,ఒమెన్ ,థాయిలాండ్ వంటి దేశాలు ఒక్కొక్కటి 8పేర్లను పంపిస్తాయి.
ఇలా పంపిన పేర్లను WMO అధికారులు 8*8 మాట్రిక్స్ రూపంలో అమర్చి ఒక్కో కాలమ్ నుండి ఒక్కో పేరును తుఫాన్ వచ్చినప్పుడు ఎంపిక చేస్తారు. ఇలా తుఫాన్లకు పేర్లు పెడతారు క్రమంగా..