ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి కౌంటింగ్ జరిగే సమయంలో అలజడి సృష్టించేలా అధికార టీడీపీ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని అన్నారు. అదే నిజమైతే కౌంటింగ్ రోజు మిగిలిన రాజకీయపక్షాలు మరింత జాగ్రత్త వహించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూసుకోవాలని, లేదంటే అధికార పార్టీ నారా లోకేష్ గెలుపు కోసం ఎంతకైనా తెగించే అవకాశాలున్నాయని, టీడీపీ కుట్రలను తిప్పికొట్టి కౌంటింగ్ సజావుగా ముగిసేలా ఎన్నికల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.
