ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి తిరిగి హైదరాబాద్ రానున్నారు. అయితే జగన్ కు కూతురంటే ఎంతో ప్రేమ.. ఆమెకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు వచ్చినపుడు కూడా జగన్ గతంలో ఒక సందర్భంలో ఎంతో సంతోషపడ్డారు. తాను రాజకీయంగా పదేళ్లనుంచి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తనకు పిల్లలతో గడిపే సమయం తక్కువ దొరకనప్పటికీ పిల్లలు ఎంతో శ్రద్ధగా చదివారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలో తన కూతురు సీటు సాధించి చదువుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. అయితే పిల్లలను ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు తన భార్య భారతిని సైతం అభినందించారు జగన్.
