ఒకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. ఇంకొకరేమో ఇండస్ట్రీకి మూల స్థంబాల్లో ఒకటైన ఆల్ టైమ్ గ్రేట్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన మన్మధుడు అక్కినేని నాగార్జున. అంతటి మహోన్నత చరిత్ర గలిగిన దిగ్గజాలు ఒకరికొకరు అండగా ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం ఏంటీ అంటే నాగ్ తనయుడు యువహీరో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై అల్లు అరవింద్ సరికొత్త చిత్రాన్ని తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.
ఈ మూవీ బడ్జెట్ పై అల్లు అరవింద్ సరిహద్దులు గీశారు అంట.. తక్కువ బడ్జెట్లోనే సినిమా తీయాలని.. అంతకుమించి బడ్జెట్ ఎక్కువైతే నేను పెట్టను అని తెగేసి చెప్పాడంటా అల్లు అరవింద్. ఇక్కడే నాగ్ ఎంట్రీ ఇచ్చి సహానిర్మాతగా వ్యవహారించాడానికి రెడీ అయ్యాడు .అసలే ఒకవైపు సరైన హిట్ లేక సతమతవుతున్న తనయుడు మూవీ కోసం అల్లు అరవింద్ ఇలా చెప్పేసరికి చేసేది ఏమి లేక నాగ్ ఎంట్రీచ్చాడంటా..
అందులో భాగంగా బడ్జెట్ ను తగ్గించే పనిలో హీరోగా నటిస్తోన్న అఖిల్ కు పారితోషకం ఇవ్వడం లేదు. మొదట సంగీత దర్శకుడుగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ను అనుకుని బడ్జెట్లో కోతలుండటంతో డీఎస్పీను పక్కనెట్టి గోపీ సుందర్ను తీసుకున్నారు. ఇక దర్శకుడు అయిన బొమ్మరిల్లు భాస్కర్ కు సినిమా అవకాశమివ్వడమే ఎక్కువగా భావించి అతనికిచ్చే పారితోషకంలో కోత పెట్టారు అల్లు అరవింద్. సో ఈ విధంగా తన తనయుడు మూవీ కోసం అల్లు అరవింద్ కు ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చారు అన్నమాట.