కర్నూలు జిల్లా కలచట్ల గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. తాగునీటి సమస్యపై అవగాహన లోపం వల్ల పల్లెల్లోని ప్రజలు గొంతెండి విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్యాపిలి మండలంలో 48 గ్రామాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చుతామని ప్రతి ఎన్నికల్లో అధికారులు మాట ఇవ్వడం… తప్పడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. రెండ్రోజులకోసారి నీటిని వదులుతున్నారు. కొన్నేళ్లుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ గ్రామ ప్రజలు వాపోతున్నారు. అంతేకాదు పనులు మానుకుని నీటి కోసం కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇదంత అధికారుల నిర్లక్ష్యం వల్లే అంటున్నారు కలచట్ల హారిజనవాడ గ్రామ ప్రజలు. ఇప్పటికైన అధికారులు మేలుకుని వారి గ్రామ ప్రజల దాహాన్ని తీర్చమని కోరుతున్నారు.