గోదావరి జలాలతో మీ గోసా తిరుస్తా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట అర్భన్ మండలం ఎన్ సాన్ పల్లి గ్రామంలో సిద్దిపేట అర్భన్ మండల జడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవి చివరి ఎన్నికలు… ఇక సేవ చేయటమే మిగిలింది.. నేను ముమ్మాటికీ మీ సేవకుడినే, సర్పంచ్, ఎంపీ టి సి లు రెండు కండ్ల వంటి వారు. ఏ పథకం మీ చెంతకు చేరాలన్న నాకు అనువైన వారుండాలి. జోడేడ్లు సరిగా ఉంటేనే సమగ్ర అభివృద్ధి. కొంతమంది గెలుస్తామంతున్నారు.. కారు గుర్తు కె ఓటు వేయండి. సరిగ్గా పని చేయించే జిమ్మేదారి తీసుకుంటా. దేశంలో ఎలాంటి పనులు జరగలేదు. కరెంట్ వచ్చింది, దసరా నాటికి నీళ్లు రాబోతున్నాయి, నేడు బతులకమ్మ ను వేద్దామంటే నీళ్లు లేవు… ఇకముందు 365 మత్తడి దుంకుతూ రోజులు నిండు కుండాలా నీళ్లు. చేరువలన్నీ ఆరు నెలల్లో కళకళ. గోదావరి నీళ్లను గతంలో మాదిరిగా చెంబు తో నీళ్లు ముంచుకునే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజి 500 కోట్లతో మన ఊరులోనే. కేంద్రీయ విద్యాలయం కూడా మన ఊరిలోనే. మీ దశ మారబోతుందన్నారు.. పట్టణానికి దీటుగా అర్బన్ మండలం అభివృద్ధి చెందాలి. అందుకే సుడా ఏర్పాటు చేసుకున్నాం. ఎల్ వి ప్రసాద్ కంటి దవాఖాన అర్బన్ మండలం పొన్నాల శివారు లోఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగ సమస్య తీరబోతుంది… రైలు పని వేగంగా జరుగుతుంది, గజేవెల్ దాకా అయిపోయింది.. గోదావరి నీళ్లు రానే వస్తున్నాయి. మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. అభ్యర్థి ని చూసి కాదు నన్ను నమ్మి ఓటు వేయండి… నేను భాద్యత తీసుకుంటా.వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమన్నారు…
Tags గోదావరి జలాలు తెలంగాణ హరీష్ రావు