గౌతమ బుద్ధుడుకి ఎప్పుడు,ఎక్కడ జ్ఞానోదయం అయింది.అంతటి గొప్ప ప్రదేశం ఎక్కడ ఉంది అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఫేస్ బుక్, వాట్సప్,ట్విట్టర్ లో మాయలో పడి ఇటువంటి మంచి విషయాల కోసం ఎవరు పట్టించుకోవడం లేదు.అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేదని చెప్పాలి.
గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం:
*బీహార్ రాష్ట్రం, గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధ గయ అనే ప్రాంతం ఉంది.
*సిద్దార్ధుడు ఇక్కడే గౌతమ బుద్ధునిగా మారాడని చెబుతారు.
*ఆయనకు ఇక్కడే జ్ఞానోదయం కలిగినది కనుక ఇది బుద్ధ గయగా పిలవబడింది.
*ఈ బుద్ధగయలో అన్నిటికన్నా ముఖ్యమైనది,పవిత్రమైనది బోధి వృక్షము.
*ఈ బోధివృక్షం ఉన్న ఆలయాన్ని మహాబోధి అని అంటారు.
*ఈ ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఇతర దేశాల వారు కట్టించిన బౌద్ధ ఆలయాలు ఉన్నాయి.
*వీటిని జపాన్,టిబెట్,సిక్కం వారు కట్టించినట్టుగా చెబుతారు.
*ఇక్కడ రావిచెట్టు క్రింద కూర్చొని తపస్సు చేస్తుండగా సిద్ధార్ధునికి జ్ఞానోదయం.
*దీనిబట్టి చూస్తే బౌద్దమతం పుట్టుక ఈ వృక్షం క్రిందనే జరిగింది.
*పూర్వం ఇక్కడ బోధివృక్షం మాత్రమే ఉండేది.కొంతకాలం తరువాత ఆ చెట్టు మొదట్లో అశోకుడు ఆసనం కట్టించారు.
*దీనినే వజ్రాసనం అని అంటారు.
*ఈ ఆలయాన్ని క్రీ.శ.640లో నిర్మించినదిగా చెబుతారు.
*ఇక్కడి ప్రవేశ ద్వారాన్ని అశోకుడు రాతితో నిర్మించారు.
*ఇక్కడ ఉన్న ఆలయ గంట దాదాపుగా అర టన్ను బరువు ఉంటుంది.దీనిని జపాన్ వారు ఇచ్చారు.
*ఈ పుణ్య ప్రదేశాన్ని చూడటానికి విదేశాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.