ఏపీ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి,ప్రస్తుత అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియాలో కన్పించడానికి సరికొత్త ఎత్తుగడకు తెరదీశారు.గత నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని విమర్శకుల వాదన. విమర్శకులు వాదిస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా అయినదానికి కానీదానికి తన ఆస్థాన మీడియా ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇటు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్తాల ప్రజలకు తెలిసిన విషయమే. అయితే గత నెల ఏప్రిల్ పదకొండు తారీఖున ఎన్నికలు జరిగిన దగ్గర నుండి నేటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వం అపద్ధర్మంగా ఉన్న సంగతి తెల్సిందే. దీంతో అధికారక కార్యక్రమాల్లో ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అటు మంత్రులుగా ఉన్న తెలుగు తమ్ముళ్ళు పాల్గోనకుండా ఎన్నికల కోడ్ అడ్దు వచ్చింది.
దీంతో ఇటు పత్రికల్లో కానీ అటు ఎలక్ట్రానికి మీడియాలో కానీ ఎటువంటి ప్రచారం లేదు. దీంతో ఆలోచించిన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్ర్తతి రోజూ మీడియాలో కన్పించడం కోసం సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. అందులో భాగంగా నిన్నటి నుండి అంటే గురువారం రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై తారీఖు వరకు ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారంటా.. పేపర్లో ,టీవీ ఛానెళ్లల్లో కన్పించకపోతే ప్రజలు ఎక్కడ మరిచిపోతారో అనే భయంతో బాబు ఈ నిర్ణయానికి వచ్చారని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు.
అయితే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగిన విధానంపై,పోలింగ్ సరళిపై ఏ పార్టీ అయిన సహాజంగా సమీక్షలు చేసుకోవడం అనవాయితీ. అయితే ఇప్పటికే ఎన్నికలు జరిగిన విధానంపై,పోలింగ్ సరళిపై పలుసార్లు సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు. అయిన కానీ ప్రజలు మరిచిపోతారేమో అనే భయంతో మరల ఈ నెల రెండో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు సమీక్ష సమావేశాలు నిర్వహించాలనుకోవడం బాబుకు పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరుకుందని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.