వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు సరికొత్త ఆనందం కలిగించింది.అయితే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన మనసులో మాట బయట పెట్టాడు.నాకు మహేష్ అంటే చాలా ఇష్టం అని..చిన్నప్పుడు మన మహేష్ మన మహేష్ అనేవాడిని ఇప్పుడు మహేష్ సర్ అనడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు.తనకి ఇష్టమైన డైలాగ్ కూడా చెప్పారు..”ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు” అనే డైలాగ్ తన ఫేవరెట్ అని చెప్పాడు.అంతేకాకుండా ‘శ్రీమంతుడు’ సినిమాకి మహేష్ కి అవార్డు వచ్చినప్పుడు నేను వెనకనుండి చూశానని.అప్పుడే ఫిక్స్ అయ్యాను లైఫ్ అంటే అలా ఉండాలి.. అని అన్నాడు.
