ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ లభించింది. నగరంలోని పంజాగుట్టలో ఈ ఉదయం ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో గొడవ సందర్భంగా బస్సు రూఫ్ టాప్ పైకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్, కండక్టర్ వాంగ్మూలం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసే కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇతడు నగరంలోని ఒక ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ప్రయాణికులతో గొడవపడి కాల్పులు గాల్లోకి కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ డీజీపీ ఠాకూర్‌కు సమాచారమిచ్చారు. దీనిపై ఆయన ఏపీ డీజీపీ స్పందిస్తూ.. శ్రీనివాస్ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.