ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్వే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ సర్వే ఏం చెబుతుందంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుస్తారా లేదా అన్నది టీడీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. దీనికి తోడు తాజాగా వచ్చిన సర్వే మంగళగిరిలో లోకేశ్ ఓటమి ఖాయం అని తేల్చి చెప్పేసింది. ఏపీ న్యూస్ యూట్యూబ్‌లో విడుదలైన ఈ సర్వే.. నిజం కాకపోతే.. ఛానల్ మూసేస్తామని సవాల్ విసరడం విశేషం. కాని మంగళగిరిలో లోకేశ్ తప్పకుండా గెలుస్తారని టీడీపీ పార్టీ దీమాగా ఉంది. కానీ ఆర్కే గట్టిగా పోటీ ఇచ్చారని.. ఆర్కే గెలుస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. అంతకంటే విచిత్రం ఏమీటంటే ఏపీ న్యూస్ ఛానల్ సర్వేలో జనసేన మంగళగిరి సీటును గెలుచుకుంటుందని చెప్పింది. అంటే లోకేశ్ ఓడిపోతున్నాడని చెప్పినట్టేగా.
