డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో ఎగిసిపడిన ఉత్తుంగ కెరటం.. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు..చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసే అక్రమాలను లెక్కలతో సహా బయటపెట్టే తెలివైన నాయకుడు. సౌమ్యంగా మాట్లాడుతూ, నవ్వుతూ, చురకలు, సెటైర్లు వేస్తూనే టీడీపీ నాయకులకు చుక్కలు చూపించడంలో బుగ్గనకు సాటి గల నాయకుడు వైసీపీలో లేరు. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ఆయనకు అపారమైన అవగాహన ఆయన్ని ఏపీ రాజకీయాల్లో విలక్షణమైన నాయకుడిగా నిలిపింది. పీఏసీ ఛైర్మన్‌గా ఆయన అందరి మెప్పు పొందారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలపై ఆయనకున్న పట్టు యనమలకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. బుగ్గన మంచి రాజకీయనాయకుడే కాదు నిబద్దత గల ప్రజాసేవకుడు. ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తీరుస్తూ, డోన్ నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నిలిపారు. వైయస్ జగన్ బుగ్గనను రాజా అని ముద్దుగా పిలుచుకుంటారు. వైసీపీ అధికారంలోకి వస్తే బుగ్గనకు ఆర్థికమంత్రిగా అవకాశం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోటు బడ్జెట్‌తో ఉన్న ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితిని మళ్లీ గాడిన పెట్టాలంటే బుగ్గనకే సాధ్యం. ఆర్థికశాఖకు బుగ్గన తనదైన వన్నె తెస్తారని అనడంలో సందేహం లేదు..ఆల్ ద బెస్ట్ బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి గారు..