యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే వైఎస్ ను సీఎంగా చూడకుండానే రాజారెడ్డి మరణించారు. అప్పటికి జగన్ చిన్నవారు. చిన్నతనం నుంచే తాతతో జగన్ కు అవినాభావ సంబంధాలుండేవి.
అనంతరం వైఎస్ ముఖ్యమంత్రి కావడం, ప్రజారంజక పాలన చేయడం, రెండోసారి ముఖ్యమంత్రి అయి అకాలమరణం చెందడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు రాజారెడ్డి చనిపోయిన రెండు దశాబ్ధాల తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జగన్ కు కూడా తాతగారంటే ఎంతో ప్రేమ ఈ నేపధ్యంలో రాజారెడ్డి చనిపోయిన రోజునే ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో వైసీపీ శ్రేణులు సెంటిమెంట్ ఫీలవుతున్నారు. కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని, ఈ గెలుపును తండ్రితోపాటు తాత రాజారెడ్డికి కూడా జగన్ అంకితమివ్వనున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు.