మేడే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం.చాలా దేశాలలో మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి.శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ..వేసిన ముందడుగే ‘మేడే’.19వ శతాబ్ధంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా,యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు.ఆ పరిశ్రమలలో గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16-18గంటలు కార్మికులు పని చెయ్యాల్సివచ్చేది.1886 మే1 అమెరికాలో చికాగోలో 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటలు పెట్టాలని కోరుతూ కార్మికులు పోరాటానికి దిగారు.కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు. 1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది.1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడటం మూలంగా అప్పటి నుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది.అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది.
Tags america countries India labour may day working days
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023