దేశవ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మే డే వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కార్మిక విభాగం జెండా ఎగురవేసి ప్రసంగించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాదు.. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన కనీస వేతనాలు అందాలనేదే సీఎం కేసీఆర్ విధానమన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి @chmallareddyMLA , మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు @balkasumantrs, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కేవీ నేతలు రాంబాబు, రూప్ సిoగ్ మరియు కార్మికులు.#MayDay pic.twitter.com/ylICCLIdcT
— TRS Party (@trspartyonline) May 1, 2019
అంగన్‌వాడీ కార్మికులకు రెండు సార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేన్నారు. అనంతరం ఇంటర్ విద్యార్ధుల గురించి మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని.. ఐటీ శాఖకు, ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రం పచ్చగా ఉంటే విపక్షాల కళ్లు మండుతున్నాయన్నారు.ఇంటర్ ఫలితాల విషయంలో విపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయన్నారు.
తెలంగాణ భవన్‌లో మే డే వేడుకలు..
మే డే దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ కార్మిక విభాగం జెండా ఎగరేసిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగిoచిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS. #MayDay pic.twitter.com/6DM8OjybEL
— TRS Party (@trspartyonline) May 1, 2019
రూ.4 కోట్ల టెండర్‌కు రూ.10వేల కోట్లు ఎవరైనా లంచంగా ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలను అవసరమైతే కోర్టుకు లాగుతామన్నారు. విపక్షాలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సమస్య సున్నితమైంది కాబట్టి అందరూ సంయమనం పాటించాలని కోరారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలకు వేరే అంశాలు చాలా ఉన్నాయని సూచించారు.