ఐపీఎల్ అభిమానులు ప్రతీఒక్కరు ఇవి తెలుసుకోవాలి.మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ముగియనుంది.ప్లేయర్స్ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు.దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిన ఐపీఎల్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.ఇప్పటిదాకా మ్యాచ్ లు అన్ని రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యేవి.శనివారం, ఆదివారం మాత్రం రెండు మ్యాచ్ లు జరిగేవి.అయితే ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బీసీసీఐ ప్రస్తుతం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసినట్టు ప్రకటించింది.జరగబోయే ప్లేఆఫ్ మ్యాచులు నుండి 7.30 గంటలకే ప్రారంభం కానున్నట్లు తెలిపింది.ఈ విషయాని ప్రతీ ఐపిఎల్ అభిమాని తెలుసుకోవాలని సూచించింది.చెన్నై చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్-1, విశాఖ పట్నంలో క్వాలిఫర్-2, ఎలిమినేషన్, హైదరాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం ఇప్పటికే అందరికి తెలుసు.అయితే ప్రస్తుతం బీసీసీఐ చేసిన మార్పులు ప్రకారం ఈ నాలుగు మ్యాచులు అరగంట ముందుగానే ప్రారంభంకానున్నాయి.
