రాజకీయాలను ఎప్పుడూ ఎవ్వరూ ఊహించలేము.. కానీ కొన్ని నియోజకవర్గాల్లో బలమైన సెంటిమెంట్ ఉంటుంది.. అక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోటల్ ఇదే పునరావృతమవుతోంది. దీంతో ఆయా అభ్యర్ధులు గెలిస్తే అధికారం తథ్యమన్న సెంటిమెంట్ బలపడింది. ఈ సెంటిమెంట్ ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంలకు వర్తిస్తోంది. అలాగే తాజాగా ముగిసిన ఎన్నికల్లో కూడా ఒక 13సీట్లు ఎవరు గెలుస్తే వారిదే ప్రభుత్వం అనే అంచనాలు వెలువడ్డాయి. కానీ ఇందుకు కారణం మాత్రం వేరేలా ఉంది. ఇదెలా అంటే ఈ నియోజకవర్గాల గెలుపే లక్ష్యం గా రెండు పార్టీలు పని చేయడంతో ఎవరి బలాబలాలు ఏంటో అర్ధమవుతాయి కాబట్టి కచ్చితంగా ఈ 13 నియోజకవర్గాల్లో ఎవరు గెలిస్తే వారే అధికారం చేజిక్కించుకుంటారనేది కేవలం ఈ ఎన్నికల సెంటిమెంట్ గా నడుస్తోంది.
ఆయా నియోజకవర్గాలను ఇప్పుడు చూద్దాం.. కర్నూలు జిల్లా నంద్యాల, కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, నెల్లూరు జిల్లా సర్వేపల్లి, ప్రకాశం జిల్లా పర్చూరు, గుంటూరు జిల్లా తెనాలి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, విశాఖజిల్లా భీమిలి, విజయనగరం జిల్లా నెల్లిమర్ల, చివరిగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఇవన్నీ జిల్లాకో నియోజకవర్గం చొప్పున వివాదరహితం కానివి తీసుకున్నారు. వీటిలో ఎక్కడా ఆయా పార్టీల అధినేతలు పోటీ చేయలేదు. చాలాచోట్ల ముఖ్యనేతలు పోటీ చేయలేదు.. కానీ ఇరుపార్టీలూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగ బలాన్ని ప్రదర్శించాయి. ఆర్ధికంగానూ సై అంటే సై అంటూ చాలాచోట్ల గెలవాలని ప్రయత్నించారు. ఈ 13 స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందోరాదో కొద్దిరోజుల్లే తేలిపోనుండగా ఇప్పటికే ఈ 13సీట్లలో 9సీట్లు తామే గెలుస్తున్నామంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది.