వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల పై విరుచుకుపడ్డారు.యనమల సిఎస్ ప్రజలను ఎలా కాపాడుతారు అని అడిగినదానికి కౌంటర్ వేసారు. అయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విధంగా అన్నారు.. తుఫాను వస్తే ప్రజలను సీఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ సీఎం విదేశాల్లో ఉంటే సహాయ చర్యలు ఆగిపోయాయా? నిద్రలో కూడా వీళ్లకు సిఎస్ పీడకలగా వస్తున్నాడు అని ఎద్దేవా చేసారు.
ఇది ఇలా ఉండగా మరో ట్వీట్ లో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఇఓ ద్వివేదిల ఫోన్లు ఈ పాటికి ట్యాప్ చేసే ఉంటారు. వారిద్దరి పేషీల్లో ఉన్న తమ అనుకుల సిబ్బంది ద్వారా మినిట్-టు-మినిట్ సమాచారం సేకరిస్తూనే ఉండి ఉంటారు. అయినా ఈ అభద్రత ఏమిటో అంతుబట్టడం లేదు? అంత దోపిడీ చేశారా? తప్పించుకోలేని స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారా? అని అన్నారు.చంద్రబాబు అండ్ టీం వీరిపైనే దృష్టి పెట్టారని.ఇంతలా వాళ్ళ పేర్లు జపిస్తున్నారు అంటే చంద్రబాబు అండ్ టీం ఎన్ని తప్పులు చేసుంటారో మీరే అర్ధం చేసుకోండి.
తుఫాను వస్తే ప్రజలను సిఎస్ రక్షిస్తారా అని యనమల ప్రశ్నించడం చూస్తే జాలేస్తుంది. ముందస్తు జాగ్రత్తల నుంచి సహాయ కార్యక్రమాల వరకూ ఎప్పుడూ పర్యవేక్షించేది జిల్లా కలెక్టర్లే కదా? గతంలో మీ సిఎం విదేశాల్లో ఉంటే సహాయ చర్యలు ఆగిపోయాయా? నిద్రలో కూడా వీళ్లకు సిఎస్ పీడకలగా వస్తున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 29, 2019
సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సిఇఓ ద్వివేదిల ఫోన్లు ఈ పాటికి ట్యాప్ చేసే ఉంటారు. వారిద్దరి పేషీల్లో ఉన్న తమ అనుకుల సిబ్బంది ద్వారా మినిట్-టు-మినిట్ సమాచారం సేకరిస్తూనే ఉండి ఉంటారు. అయినా ఈ అభద్రత ఏమిటో అంతుబట్టడం లేదు? అంత దోపిడీ చేశారా? తప్పించుకోలేని స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 29, 2019