Home / 18+ / ఢిల్లీలో ప్ర‌భుత్వంపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఢిల్లీలో ప్ర‌భుత్వంపై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను నెర‌వేర్చేలా టీఆర్ఎస్ పార్టీ న‌డుచుకుంటుంద‌ని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్‌ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్క్ కేటీఆర్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రజలతో సంభాషించారు. దేశం, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత ఇష్టాలు ఇలా అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తన అభిప్రాయాలను వెల్లడించారు.

జాతీయ రాజ‌కీయాల గురించి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయని అన్నారు. వీటి ద్వారానే రాష్ట్రాలు బలోపేతమవుతాయని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అత్యుత్తమ ఆర్థిక విధానాలతోనే దేశంలో ఉద్యోగ, సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు. ఉత్తమ ఆర్థిక విధానాలే రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, నిజామాబాద్ స్థానంలోనూ టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వమైనా నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

బీజేపీ చేస్తున్న‌ త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని కేటీఆర్ కోరారు. “ఎంఎంటీఎస్ రెండోదశ కోసం మరిన్ని నిధులు విడుదల కావడంలేదని ఎవరు చెప్పారు. బీజేపీ తప్పుడు మాటలను నమ్మొద్దు. ఎన్డీయే ప్రభుత్వం హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ నెట్‌వర్క్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. కనీసం రాబోయే కేంద్ర ప్రభుత్వమైనా ఈ అన్యాయాన్ని సరిదిద్దుతుందని ఆశిస్తున్నాం“ అని కేటీఆర్ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat