కొన్నిరోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ రానుంది.దీనికి గాను అన్ని జట్ల స్క్వాడ్ ఇప్పటికే రిలీజ్ చేసారు.ఈ మెగా ఈవెంట్ కు క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ ప్రాతినిథ్యం వహిస్తుందని అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జరుగుతుంది.అయితే ఇందులో బయట ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు.ప్రపంచకప్ దగ్గర పడడంతో కొంతమంది ఆటగాళ్ళు వారి దేశానికీ వెళ్ళిపోయారు.ప్రస్తుతానికి ఈ ఐపీఎల్ పేరు చెప్తే అల్ రౌండర్ లిస్ట్ లో కరేబియన్ విధ్వంసకర ప్లేయర్ రస్సెల్ నే అందరికి గుర్తొస్తాడు.నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై దగ్గర వరకు వచ్చి కలకత్తా పై ఓడిపోయింది.అయితే ఈ మ్యాచ్ లో రస్సెల్ మరోసారి విరుచుకుపడ్డాడు.దీంతో కేకేఆర్ 232స్కోర్ కొట్టింది.ముంబై ఈ టార్గెట్ కొట్టాడని అందరు అనుకున్నారు.ఆ పరంగానే వరుస క్రమంలో వికెట్లు కూడా పడ్డాయి.కాని అప్పుడే వచ్చాడు మన ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.ఏకంగా 33బంతుల్లో 91రన్స్ కొట్టి ఒక్క క్షణం కేకేఆర్ కు చెమటలు పట్టించాడు.కాని అప్పటికే కొట్టాల్సిన రన్స్ ఎక్కువ ఉండడంతో ముంబై దగ్గరవరకు వచ్చి ఓడిపోయింది.పాండ్య ఆటతో మన భారత్ జట్టుకు మిడిల్ ఆర్డర్ కూడా గట్టిగానే ఉందని అర్దమైంది.