వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చనున్నడా? తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చూస్తే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ ద్వారా పైపుల రోడ్డులో ఎన్టీఅర్ సర్కిల్ దగ్గర ఈ ఆదివారం సాయంత్రం 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను.మీడియా మిత్రులకి, ఎన్టీఅర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుండి అందరిని ఆహ్వానించారు.అంతే కాకుండా ఎన్టీఅర్ మరణానికి కారణం..? అంటూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఇది మే 1న విడుదల అని కూడా చెప్పాడు.ఇప్పటికే తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీర్ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.అయితే ఈ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయనివ్వలేదు.మరి ఈరోజు వర్మ ప్రెస్ ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిందే.