ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా మంత్రి యనమల కూడా ఆయనపై చిర్రుబుర్రులాడారు.అయితే దీనిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా సమాధానం చెప్పారు. అదేమిటంటే..మీకెలాగూ పనిలేదు. సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబూ. మే24 దాకా ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే. సిఎస్ ను కోవర్టు, సహ నిందితుడని నిందిస్తారు. కుల మీడియాతో ఆయనపై రోజుకో రకంగా బురద చల్లిస్తున్నారు. అపద్ధర్మ ప్రభుత్వం మీది. మర్చిపోతే ఎలా? అని చంద్రబాబుని ప్రశ్నించారు.
మీకెలాగూ పనిలేదు. సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఎందుకు ఆడిపోసుకుంటున్నారు చంద్రబాబూ. మే24 దాకా ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే. సిఎస్ ను కోవర్టు, సహ నిందితుడని నిందిస్తారు. కుల మీడియాతో ఆయనపై రోజుకో రకంగా బురద చల్లిస్తున్నారు. అపద్ధర్మ ప్రభుత్వం మీది. మర్చిపోతే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 28, 2019