అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ దీమాగా ఉంది. ఎంత ధీమాగా అంటే, ఎన్నికల ఫలితాలు రాకముందే ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తేదీలు కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. తిథి, వార, నక్షత్రాలు కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మే 26న ప్రమాణస్వీకారం చేయనున్నారని, చంద్రబాబునాయుడు జూన్ 8 వరకు ఎలా పదవిలో ఉంటారని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాటలను బట్టి చూస్తే జగన్ ప్రమాణస్వీకారం మే 26న ఉంటుందని అర్థం అవుతోంది. అయితే, ఆరోజే ప్రమాణస్వీకారం చేయడానికి చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తిథి,వారం, నక్షత్రం అన్నీ కలిసివచ్చేలా ఆ రోజు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న పుట్టారు. ఆయనది ఆరుద్ర నక్షత్రం. 2019 మే 26వ తేదీన ధనిష్ట నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమమైత్రతార. ఆ రోజు ఆదివారం. సప్తమి. భాను సప్తమి అంటారు. సూర్యుడు అన్ని తారలకు అధిపతి. ప్రమాణస్వీకారం, పట్టాభిషేకానికి అలాంటి ముహూర్తాలు చాలా మంచివని పండితులు చెబుతారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు ప్రమాణస్వీకారం చేయాలని ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.