వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ? స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా? అని చంద్రబాబుని ప్రశ్నించారు.చంద్రబాబు ఒక రాష్ట్రానికి అధినేత అయి ఉండి కూడా ప్రతిపక్షంపై నిందలు వేయడం సరికాదని ఏ చిన్న విషయంలో తప్పు జరిగిన చంద్రబాబుకు ముందుగా మేమే గుర్తోస్తామని అన్ని మమల్ని ఉద్దేశించి మాట్లాడడం సరికాదని అన్నారు.ఎన్నికలు అయ్యేంతవరకు అన్ని ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా? అని అన్నారు.
ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ? స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2019