ఆంధ్రాబ్యాంకును మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుకు సంబంధించి శుక్రవారం బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి కాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయంలోని బ్యాంకింగ్ సెక్యూరిటీ ఫ్రాడ్ సెల్ అధికారుల ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. రాత్రి 10వరకు అందిన సమాచారం ప్రకారం ఈ విచారణకు ఆయన హాజరు కాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. శని, ఆది వారాలు సెలవులు కావడంతో కోర్టులు ఉండవని, ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్ కు వీలుకాదని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు.
2017లో నమోదు చేసిన ఓ కేసు విషయంలో రేపు తమ ముందు హాజరుకావాలని సీబీఐ బెంగళూరు బ్రాంచ్ సుజనాచౌదరికి సమన్లు జారీ చేసింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో మూడు బ్యాంకులకు వందల కోట్లు నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదైంది. 2017లో ఆంధ్రాబ్యాంకును రూ.71కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనపై గురువారం సమన్లు జారీ అయ్యాయి.కార్పొరేషన్ బ్యాంకు ,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లను కూడా అయన ముంచేశారు. ఇప్పుడు ఆంధ్రా బ్యాంకును మోసం చేసిన వ్యవహారంలో తమ ముందు హాజరుకావాలని సీబీఐ సూచించింది. ఇంతకూ ముందే ఈడీ సుజనాకు చెందిన 315 కోట్లు ఆస్తులు జప్తుచేసింది. గతంలో ఈడీ తనను అరెస్ట్ చేయకుండా ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.