ఐపీఎల్ ప్రతీ జట్టుకు ఓనర్ ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ఓనర్స్ లో కొంతమంది సెలబ్రేటీస్ కూడా ఉన్నారు అందులో ఒక అందాల ముందుగుమ్మ కూడా ఉంది.ఆమె ఎవరో కాదు..ప్రీతీ జింటా. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని.తన అందం మరియు నటనతో తాను నటించిన చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఈ మెగా ఈవెంట్ లో కూడా అదే ట్రెండ్ సెట్ చేస్తుంది.అయితే తన జట్టు ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా కొట్టలేదు.ఒక సీజన్లో మాత్రం మంచి ఆట కనబరిచింది.చాలా దగ్గరవరకు వచ్చి ఛాన్స్ కోల్పోయింది.అయితే రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లను రెండేళ్ళ పాటు నిషేధించిన విషయం అందరికి తెలిసిందే.ఆ సమయంలో రెండు కొత్త జట్లు పూణే,గుజరాత్ వచ్చాయి.ఇందులో పూణేకు ధోని కెప్టెన్ గా వ్యవహరించారు.ఆ సమయంలోనే ప్రీతీ జింటా ధోనిని తన టీమ్ కి ఆడామని అడిగినట్టు చాలా వార్తలు కూడా వచ్చాయి.ఇది అలా ఉండగా ప్రస్తుతం ఇప్పుడు ధోని కెప్టెన్సీ లో చెన్నై భీకర ఫామ్ లో ఉంది.ఇప్పుడు కూడా ప్రీతీ జింటా మిస్టర్ కూల్ ను తన టీమ్ కు ఆడామని కోరినట్టు సమాచారం.ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాలచల్ చేస్తుంది.