దేశంలో ఇప్పటికే రూ.10, రూ.100 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటును విడుదల చేయనుంది.మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది.గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోటు నమూనా శనివారం విడుదల చేసారు.కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసారు.
ఈ నోటు కోసం కొన్ని ఆశక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఆర్బీఐ నమూనా ప్రకారం..
*ఈ నోటు ఆకుపచ్చ, పసుపు రంగుల కలయికలో ఉంటుంది.
*దీని ముందు భాగంలో గాంధీజీ బొమ్మ దానిపక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని ఉంటుంది.
*గాంధీజీ బొమ్మకు మరోవైపు అశోకుడి స్థూపం ఉంటుంది.
*ఈ నోటుకు మరో భాగంలో ఎల్లోరా గుహలు ,స్వచ్ఛభారత్ నినాదంతో పాటు లోగో ఉంటుంది.
*ఇక ఈ నోటు కొలత విషయానికి వస్తే “63 mm x 129 mm” ఉంటుంది.