విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామివారిని సీఎం కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిదానానికి సీఎం వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూన్‌లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్‌ని స్వరూపానంద ఆహ్వానించారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్‌లోని దైవసన్నిధానానికి విచ్చేసిన స్వరూపానందను కేసీఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.