సిద్దిపేట పారుపల్లి వీధిలో గల శ్రీ రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరిశ్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ స్వాములతో కల్సి భిక్ష చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హనుమాన్ నామ స్మరణ.. సర్వపాప హారణ..!! అని హనుమత్ కృప తోనే సర్వజగద్రక్ష అని.. అంజనేయుని అనుగ్రహము ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని అన్నారు.. ఆ స్వామి ఆశీస్సులతో అందరికి శుభం కలగాలి అని.. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు..శ్రీ రామ రాజు రావి చెట్టు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా దాదాపు 2000 మంది హనుమాన్ మాల దారులకు భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయం అని.. స్వాములు తో కల్సి భిక్ష చేయడం లో గొప్ప ఆనందం కలిగిందని ఇంత కంటే గొప్ప పుణ్యం ఏముందన్నారు.. సిద్దిపేట లో మొట్టమొదటి భిక్ష కార్యక్రమం ఈ ఆలయం నుండే ప్రారంభం అయ్యింది ఆదర్శంగా నిలిచిందన్నారు.. సిద్దిపేట ఆధ్యాత్మికతకు… భక్తి పారవశ్యాన్ని సంతరించుకున్న ప్రాంతం అని..అదే స్ఫూర్తితో హనుమాన్ మాల దారుల బిక్షకు నెలవు గా మారిందన్నారు..ఈ సందర్భంగా దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ స్వాములతో కల్సి భిక్ష చేశారు…