అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేకపోయాయి.మరోపక్క రష్మిక..తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా ఎలా ఉండబోతుందో చూపించనున్నారు.హీరోయిన్ రష్మిక తెలుగులో తన మొదటి చిత్రమైన ఛలో తో తన ఖాతాలో హిట్ వేసుకుంది.ఇక ఆ తరువాత గీత గోవిందం ఎలాంటి హిట్ కొట్టిందో మీ అందరికి తెలిసిందే.ఆ తరువాత నానితో నటించిన దేవదాసు కూడా హిట్ టాక్ వచ్చింది.తాజాగా అఖిల్ కొత్త సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసారు.ఈ చిత్రాని అల్లు అరవింద్ నిర్మించగా..దర్శకత్వ భాద్యతలు బొమ్మరిల్లు భాస్కర్ వహిస్తున్నారు.అయితే రష్మిక అఖిల్ కు హిట్ ఇవ్వబోతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
