మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్ ఆర్ట్స్ నన్‌చక్స్‌లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్‌చక్స్‌లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి.పూరీ తనయుడు ఆకాష్ హీరోగా తన మొదటి సినిమా ఐన మెహబూబాతో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాడు.ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమాలో నటిస్తున్నారు.ఇందులో స్పెషల్ ఏమిటంటే పూరి శిష్యుడైన అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.స్క్రీన్ ప్లే, డైలాగులు, కథ పూరీనే.దీనిక్ గాను పూరీ, ఛార్మి కలిసి నిర్మించనున్నారు.ఆకాశ్ కు జంటగా కేతికా శర్మ నటించనుంది.
I can never beat him at nunchucks .#DaddyCool ??? @purijagan pic.twitter.com/7tWZ4UVVaU
— AKASH PURI (@ActorAkashPuri) April 24, 2019