రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కాంచన -3 సినిమా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.మంచి సూపర్ హిట్ కూడా అయింది.అయితే ఈ చిత్రంలో ఓ పాత్రలో రష్యన్ అమ్మాయి నటించగా..ఆమెను లైంగికంగా వేధిస్తున్నరనే ఆరోపణలు రావడంతో నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాంచన -3లో నటించిన ఈ రష్యన్ భామ తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది.ఈమె, తన భర్త, పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం రష్యా నుండి చెన్నైకి వచ్చి,ప్రస్తుతం ఇక్కడ ఎంఆర్‌సీ నగర్ లో నివాసం ఉంటుంది.
గతంలో ఈ నటి కొన్ని యాడ్స్‌లో నటించిగా తనతో పాటుగా రుబేశ్ కుమార్ కూడా నటించేవాడు.అప్పటినుండి తనని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది.రకరకాల ఫోటోలుతీసి తన వాట్స్ యాప్ కు పంపుతూ తన కోరిక తీర్చకుంటే ఆ ఫోటోలను అందరు చూసేలా వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రుబేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసారు.