అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత
ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే.
అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక గాంధీ వారణాసి నుండి బరిలోకి దిగలేదడం లేదని తేలింది.ఈ స్థానం నుండి అజయ్ రాయ్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. దీంతో ప్రియాంక గాంధీ పోటి చేస్తారన్న ప్రచారానికి తెరపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రియాంకకు సీటు ఇవ్వలేదా.. లేదా ఆమె స్వయంగా బరిలో నుండి తప్పుకున్నారా అని చర్చ దేశ రాజకీయాల్లో మొదలైంది..