– దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష సాయం
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం మూడుచింతల తండాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు ధీరావత్ మహేశ్ చైనాలో జరిగే ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. దీంతోపాటే పారా క్రికెట్ ఇండియా టీమ్ వైస్‌కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. బీచ్ వాలీబాల్ మే నెలలో చైనాలో జరగనుంది. అక్కడికి వెళ్లడానికి ఆర్థిక స్థోమత లేక మహేశ్ సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ మహేశ్‌కు రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ స్పందిస్తూ… ‘కూలీనాలి చేసుకునే కుటుంబంలో పుట్టాను.అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. చైనాకు వెళ్లడానికి ఆర్థిక సాయం చేసిన కేటీఆర్ సార్‌కు ధన్యవాదాలు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల పక్షమని కేటీఆర్ సార్ మరోసారి నిరూపించారు’ అన్నాడు.