Home / 18+ / అవతార్ కు చెక్ పెట్టేందుకు..అవెంజర్స్ రెడీ..!!

అవతార్ కు చెక్ పెట్టేందుకు..అవెంజర్స్ రెడీ..!!

‘అవతార్‌’ఇప్పటివరకూ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది. దాదాపు పదేళ్ల క్రితమే 278 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటివరకూ ఏ చిత్రమూ కూడా దీనిని క్రాస్ చేయలేకపాయింది.ప్రస్తుతం ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో వస్తున్న ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’కు అవతార్ వసూళ్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ భారత్‌లో రూ.298 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లందుకున్న హాలీవుడ్‌ చిత్రంగా నిలిచింది విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం అవెంజర్స్ సిరీస్ లో నాలుగో చిత్రంగా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’వస్తుంది.ఇండియాలో ఎప్పుడు విశేష స్పందన లబిస్తుంది.దీన్ని దృష్టిలో పెట్టుకున్న చిత్ర దర్శకుడు జో రుస్సో భారత్‌కు వచ్చి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.మ్యూజికల్ ప్రబంజనం ఏఆర్‌ రెహమాన్‌తో ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో త్రీడీ, టూడీల్లో విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా ఆన్‌లైన్‌ బుకింగ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. బుక్‌ మై షో ఆప్‌లో తొలి 24 గంటల్లోనే పది లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని ఆ సంస్థ వెల్లడించింది. అంటే సెకనుకు 18 టికెట్లు! ఇతర దేశాలలో అయితే ‘ఎండ్‌గేమ్‌’ సందడి మామూలుగా లేదు.

అమెరికాలో ఫ్యాన్‌డాంగో బుకింగ్‌ ఆప్‌లో ‘స్టార్‌ వార్స్‌: ది ఫోర్స్‌ అవేకెన్స్‌’కు 24 గంటల్లో అమ్ముడైన టికెట్ల సంఖ్యను ‘ఎండ్‌గేమ్‌’ ఎనిమిది గంటల్లోనే అధిగమించేసి తొలి స్థానంలో నిలిచిందట. చైనాలోనూ ఆన్‌లైన్‌ బుకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.అన్ని దేశాలలో ఇదే పరిస్థితి ఎక్కడ చూసిన ఎండ్‌గేమ్..ఎండ్‌గేమ్ ఇది తప్ప వేరే మాట రావడంలేదు.దీనిబట్టి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలుస్తుంది.ఇండియాలో ఈ ఏడాది అత్యధికంగా తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తుందని బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు.తెలుగు రాష్ట్రాలలో సుమారు 500పైగా థియేటర్లలో చిత్రం విడుదల కానుంది.దీంతో ఇది ఇండియాలో ఈ ఏడాది అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచినా ఆశ్చర్యం లేదని బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఐదు వందలకు పైగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat