కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో శివ కార్తికేయన్ ఈ నెల పద్దెనిమిది తారీఖున జరిగిన ఎన్నికల్లో వలసరవక్కం బూత్ లో ఓటేసేందుకు వెళ్లారు. అక్కడకి అతను ,తన భార్య ఆర్తి వెళ్ళారు. అయితే ఓటరు జాబితాలో ఆర్తి పేరు మాత్రమే ఉంది . హీరో శివ కార్తికేయన్ పేరు మాత్రం లేదు. అయినా సరే హీరో శివ కార్తికేయన్ ఓటేసి వచ్చి మరి ఇంకు పెట్టిన వ్రేలితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై మీడియా ప్రశ్నిస్తే ప్రత్యేక అనుమతి పోందాను అని తెలిపాడు. దీంతో ఓటరు జాబితాలో పేరు లేకుండా ఓటేసిన హీరో శివ ,బూత్ అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది..
