ఎన్నికలు ముగిసాయి.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు పలు ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ విషయాన్ని పలువురు జనసేన నేతలు ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ వద్ద ప్రస్తావించగా పవన్ ఈ అంశంపై స్పందించారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని చెప్పుకోవాల్సివచ్చింది. అయితే ఇప్పటికే చాలా పార్టీ కార్యాలయాలను అభిమానులు మూసివేసారు. కానీ పవన్ మాట్లాడుతూ జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ తన కార్యాచరణ వెల్లడించలేదు.
