క్రికెట్ దేవుడు భారత రత్న సచిన్ టెండూల్కర్ ఈరోజున 46వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయన క్రీడా ప్రస్థానం మీకోసం..!
* సచిన్ టెండూల్కర్ 1973 ఏప్రిల్ 24న ముంబయిలో జన్మించారు.
*పదహారేళ్ల వయసులో అంటే 1989 భారత్- పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన అడుగుపెట్టారు.
*ఆ తరువాత 1990లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాగా ఆయనకు ఇదే తొలి శతకం.ఆ తరువాత జరిగిన మ్యాచ్‌లో 165 పరుగులు సాధించి,సచిన్ భారత్‌ను గెలిపించారు.
*1999లో వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్‌లో సచిన్‌తో బ్రిటన్ రాణి మాట్లాడారు.
*2004 మార్చి 4న పాక్ తో వన్డే సిరీస్ కోసం భారత్ జట్టు పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్దంగా ఉండగా..అదే సమయంలో సచిన్ ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎగబడ్డారు.
*భారత్ తరపున క్రికెట్ లో సునీల్ గవాస్కర్ కు ఉన్న పేరు చాలా పెద్దది.అయితే 2005లో టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక శతకాలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సచిన్ బ్రేక్ చేశారు.దీంతో సచిన్ ‘లిటిల్ మాస్టర్’ గా పేరు సంపాదించారు.
*2008లో వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారా పేరిట 11,953 పరుగులతో ఉన్న రికార్డును సచిన్ క్రాస్ చేసి టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించారు.
*2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డుగా నిలిచింది. అయితే, దాన్ని 2011 డిసెంబర్‌లో సెహ్వాగ్ బ్రేక్ చేశారు.
*2011లో ధోని సారధ్యంలో ప్రపంచకప్ సాధించిన భారత్. సచిన్ కి ఇది 6వ ప్రపంచ కప్.
*2012 మార్చిలో భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 100వ శతకం(అంతర్జాతీయ క్రికెట్‌లో) సాదించారు,ఆ తరువాత వన్డే మ్యాచ్‌లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఆ ఏడాది డిసెంబర్‌లో ప్రకటించడం జరిగింది.