తాజాగా చిత్రలహరి చిత్రంతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల అనూహ్యంగా తన ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రస్తావించారు. తాను పదవ తరగతి చదువుతున్నప్పుడే అమ్మానాన్నలు విడిపోయారని చెప్పాడు. అయినా నాన్న లేని లోటు తెలియకుండా అమ్మ తనను, తమ్ముడిని పెంచిందని చెప్పారు. నాన్నతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని చెప్పారు. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని, వాళ్లిద్దరి మధ్య సినిమాల ప్రస్తావన ఉండదని చెప్పారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని సొంత ఊర్లో ఉన్నారని చెప్పాడు. ఇక అమ్మ,నాన్న విడిపోయాక అమ్మ 2011లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పాడు. అయితే తాను తమ్ముడు పెళ్లిళ్లు చేసుకుంటే అమ్మ ఒంటరిగా ఉంటుందనే అమ్మని ఐ స్పెషలిస్ట్ తో రెండోపెళ్లికి ఒప్పించామన్నారు. ఆయన చాలా మంచివారని.. అమ్మని, తమను బాగా చూసుకుంటున్నారని చెప్పాడు. ఇప్పుడు తమ్ముడు, అమ్మతో కలిసి వారితోనే ఉంటున్నామని చెప్పారు.