ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 23న వైసీపీ పార్టీ అధికారంలోకి కచ్చితంగా వస్తుంది అని ఇప్పటికే అన్ని సర్వేలు తెలిపాయి. తాజాగా ఎన్నికల ఫలితాలపై మరో కొత్త సర్వే అందుబాటులోకి వచ్చింది. జర్నలిస్టులు చేసిన సర్వే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సర్వే చేయించింది మోహన్, మధు, శ్రీధర్ అంటూ పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వైసీపీ పార్టీకి జైకొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ 131 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. టీడీపీ పార్టీ 40 స్థానాలకే పరిమితం అవుతుందట. ఇక జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కేవలం నాలుగు సీట్లు గెలుస్తుందని ఈ సర్వే అంచనా వేస్తోంది.అంతేకాదు కీలక నియోజకవర్గంలో వైసీపీ ధాటికి మంగళగిరిలో లోకేశ్ మట్టికరవడం ఖాయమట. అలాగే భీమవరంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోవడం ఖాయమట. కాకపోతే పవన్ కల్యాణ్ తన రెండో స్థానం గాజువాకలో మాత్రం గెలుస్తాడట. ఇక హిందూపూర్‌లో బాలయ్య, కుప్పంలో చంద్రబాబు నెగ్గుతారట. ఎంపీ స్థానాల విషయానికి వస్తే.. వైసీపీ ప్రభంజనమే సృష్టిస్తుందట. అయితే విశాఖపట్నంలో జనసేన – టీడీపీ- వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందట. మొత్తం మీద జగన్ ధాటికి లోకేశ్ తన తొలి ప్రత్యక్ష ఎన్నికలోనే మట్టికరవబోతున్నాడా.. చూడాలి మరి ఇది ఎంతవరకూ నిజమవుతుందో..?
