Home / POLITICS / క్యాడర్‌, లీడర్‌ లేకపోవడంతో కామెడీ నిర్ణ‌యం తీసుకున్న తెలుగుదేశం

క్యాడర్‌, లీడర్‌ లేకపోవడంతో కామెడీ నిర్ణ‌యం తీసుకున్న తెలుగుదేశం

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితి…ఇలాంటి పరిచయ వాక్యాలకు పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జరుగుతనున్న పరిషత్‌ ఎన్నికలపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకపోవడమే సరైనదని ముందుగా భావించినప్పటికీ… కనీసం ఉన్న పదిమంది నాయకుల కోసమైనా… బరిలో నిలవాలని భావిస్తోంది. స్థూలంగా వీలైతే పోటీ చేద్దాం..లేదంటే మద్దతిద్దాం అనే నిర్ణయానికి వచ్చింది. ఆ మద్దతు సైతం కాంగ్రెస్‌ పార్టీ అడగకుండానే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిసైడయింది.

తెలంగాణ‌ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై తెలుగుదేశం ఎంతో మథనం చెందింది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయని నేపథ్యంలో కనీసం ఈ ఎన్నికల్లో అయినా తమ ఉనికి చాటుకోవాలని చూసింది. అయితే, అన్నిచోట్లా సొంతంగా బరిలో దిగే సత్తా లేదని తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకున్నందుకు మూల్యం చెల్లించుకున్నామని భావించిన కాంగ్రెస్‌ టీడీపీని వదిలించుకుంది. అయినప్పటికీ మరోమారు ఆ పార్టీ పొత్తుకోసం ప్రయత్నించినా కాంగ్రెస్‌ నేతలు కిమ్మనలేదు. ఇలా హస్తం పార్టీ నేతల నుంచి స్పందన లేకపోయినా… ఆ పార్టీకే మద్దతు ఇవ్వాలని డిసైడయింది. ఉన్నచోట తెలుగుదేశం నాయకులు పోటీలో ఉంటారని, మిగిలిన చోట కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలు డిసైడయ్యారు. కాగా, క్యాడర్‌, లీడర్‌ లేకపోవడంతో టీడీపీ ఇలా నిర్ణయం తీసుకుందని పలువురు పేర్కొంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat