ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యంపై అధికార టీడీపీ నేతలు,అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. అయితే,ఇలా ఎల్వీ సుబ్రమణ్యంపై విమర్శలతో
విరుచుకుపడటం వెనక పెద్ద అవినీతి వ్యవహారాల సంఘటన నెలకొన్నదని ఆర్ధమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ
గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 లో టీడీపీ మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్‌కి చెందిన భవనంలో శ్రీ వెంకటేశ్వరా మల్టీఫ్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆఫీసు ఉంది. ఆ
ఆఫీసు వాళ్లు ప్రతినెల దేవేందర్ గౌడ్‌కు అద్దె చెల్లిస్తున్నారు. అయితే అదే బిల్డింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరున అద్దె చెల్లిస్తోంది.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఈ బిల్డింగ్‌ను హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంగా
చూపించాడు.నిజానికి కోడెల శివప్రసాద్ గుంటూరులో ఉంటాడు. లేదా నరసరావు పేటలోని తన ఇంట్లో ఉంటాడు. లేకపోతే సత్తెనపల్లిలోని తన ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆయన హైదరాబాద్‌లో ఇప్పుడు కాపురం ఉండడం లేదు. అయినా దొంగ బిల్లులు పెట్టి నెల నెలా లక్ష రూపాయల అద్దెను ప్రభుత్వం నుంచి అప్పనంగా కొట్టేస్తున్నట్టు రుజువైంది.దీంతో అవినీతి అక్రమాలు చేస్తూ మరోసారి అడ్డంగా దొరికిపోయాడు కోడెల.