అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి అంతా అయ్యిపోయాక గొంతు చించుకుంటున్నారు.ఎన్నికల్లో తాను చేసిన ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.ఓటుకు రెండువేలు నుండి ఐదు వేల వరకు తమ నియోకవర్గంలో ఇచ్చామని..ఈ మేరకు సుమారు యాబై కోట్లు వరకు ఇక్కడ ఖర్చు అయ్యిందని చెప్పారు.ఒకవేళ ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ డబ్బు పంచకపోతే తమ పార్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని అన్నారు.అయితే తాము ఎన్నికల్లో ఖర్చు చేసిందంతా అవినీతి సోమ్మేనని ఆయన నోటితోనే అన్నారు.