తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలైంది. ఈ నెల పదకొండున పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఆ ఎన్నికలు జరిగి నెల తిరక్కముందే స్థానిక సంస్థలకు గంట మ్రోగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థలలో మొదటి విడతలో భాగంగా ముప్పై రెండు జిల్లాలోని 193జెడ్పీటీసీ,2166ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించబడును. వచ్చే నెల మే ఆరో తారీఖున పోలింగ్ జరుగుతుంది. ఈ నెల ఇరవై ఐదో తారీఖున నామినేషన్లను పరీశిలించి అదే రోజున బరిలోకి దిగే అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారు. ఏమన్నా అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున స్వీకరిస్తారు.
ఇరవై ఏడో తారీఖున అభ్యంతరాలను పరిశీలించి తర్వాత రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహారణకు అవకాశం కల్పిస్తారు.బీ-ఫాంలు ఇచ్చిన పలు రాజకీయ పార్టీల తరపున ఆయా అభ్యర్థులకు ఆయా పార్టీల తరపున గుర్తులు కేటాయిస్తారు. ఈనెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల నాలుగో తారీఖు వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. మే ఆరో తారీఖున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.