గత కొన్ని సంవత్సరాలుగా నిత్యం నెల్లూరు పట్టణ పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ..పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతూనే… కొన్ని కొత్త మంజూరీలు కూడా తెచ్చుకుని హడావుడి చేస్తూ పార్టీ నేతల్లో ఉత్సాహాం నింపుతూ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు ఆయనే నెల్లూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. అనీల్ కుమార్ కు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ యువతలో క్రేజ్ ఉంది. తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన కందుల శ్రీనివాస్ అనే యువకుడు అనీల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ ఖాతాకు ఫాలోవర్ గా ఉన్నాడు. ఆయన అనీల్ కుమార్ యాదవ్ పై అంతులేని అభిమానాన్ని పెంచుకున్న శ్రీనివాస్ ఆదివారం ఉదయం తన ట్విట్టర్ ఖాతా నుండి అనీల్ కుమార్ యాదవ్ కు ఇలా సందేశం పంపాడు… అన్నా… మీ వీరాభిమానిని. మాది తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా… రోజూ మీ వీడియోలు చూడనిదే నిద్రపట్టదు… మీతో ఓ ఫోటో దిగాలి అని నా కోరిక… మీతో ఫోటో దిగాక, చచ్చినా ఏం కాదని… శ్రీనివాస్ ట్వీట్ చేశాడు… కాసేపటికి దాన్ని చూసుకున్న ఎమ్మెల్యే అనీల్ ట్విట్టర్ లోనే దానికి సమాధానమిచ్చారు. శ్రీనివాస్… నాపై నీవు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు… నీకు నా ఆశీస్సులు… ఫోటో దిగాక చచ్చినా ఏం కాదు అన్నావు… అవి మంచి మాటలు కాదు… నీకు మంచి భవిష్యత్తు ఉంది… కుటుంబసభ్యులతో సంతోషంగా ఉండు…. అంటూ శ్రీనివాస్ ట్వీట్ కు రిప్లై ట్వీట్ ఇచ్చారు అనీల్ కుమార్ యాదవ్… అనీల్ కు యువతలో ఉన్న క్రేజ్ కు ఇదో ఉదాహరణ….
Srinivas , I'm blessed to have ur affection on me but the last line isn't good , you have very bright future stay Happy with your family . https://t.co/wvOxBImy93
— Dr.Anil Kumar Yadav (@AKYOnline) April 21, 2019