37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు నెగ్గింది.
162 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది.ధోని మాత్రం ఒంటరిగా పోరాడి గెలుస్తామనే ఆశ తెప్పించాడు.అయితే ఓవర్‌లో 26 పరుగులు అవసరం కాగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చాడు.స్ట్రైక్ లో ఉన్న ధోని బౌలర్ ఫై విరుచుకుపడ్డాడు.ఓవర్ లో 24 పరుగులు రాబట్టాడు.చివరికి బంతికి 2 పరుగులు అవసరం కాగా పరుగు తీసే సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న శార్దుల్ ఠాకూర్ రనౌట్ అయ్యాడు.దీంతో బెంగళూరు విజయం సాధించింది.విరాట్ కోహ్లీ చెన్నై కెప్టెన్ ధోనీని ప్రశంసల్లో ముంచెత్తాడు.