హైదరాబాద్‌లోని చిలకలగూడ గీతానర్సింగ్ హోంలో హేమలత, లక్ష్మణ్ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఈనెల 2వ తేదీన కాన్పు జరగ్గా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలలు నిండకముందే జన్మించడంతో ఆ శిశువులను ఆధునిక వైద్యం కోసం విద్యానగర్‌లోని నియో బీబీసీ ఆస్పత్రికి తరలించారు. పుట్టిన సమయంలో కేవలం వెయ్యి గ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు ఆధునిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ శిశువులు 1.3, 1.4 కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు తల్లి పాలు తాగుతున్నట్లు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీరాములు తెలిపారు.
