సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. ఫలితం చూస్తే అనారోగ్యం బారినపడిన వారికి మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇవ్వగా.. బ్యాంకర్లు వారిని తిప్పి పంపిస్తున్నారు.ఎందుకని అడిగితే ఇందులో డబ్బులు లేవని చెప్పుకోస్తున్నారట.ఈ సంఘటన తాజాగా కర్నూలు జిల్లాలో జరిగింది.కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన జ్యోతి పేరిట ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును కావాల్సిన ఫండ్స్ లేవని బ్యాంక్ అధికారులు వెనక్కి ఇచ్చారు.
అసలు వివరాల్లోకి వెళితే..కర్నూలు జిల్లా రెవెన్యూ కాలనీకి చెందిన గంగాధర్‌రెడ్డి భార్య జ్యోతికి 2018 నవంబర్‌లో తీవ్ర కడుపు నొప్పి రావటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయించాలని చెప్పగా. వాళ్ళకు ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవడంతో అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించారు.ఆమె ఆపరేషన్ కు గాను మొత్తం రూ.56 వేలు ఖర్చయ్యింది. సహాయం కోసం టీడీపీ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా నవంబర్ 26న ఆ కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.అయితే ఈ ఏడాది మార్చి 15న రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆ కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందించారు. 10వ తేదీన చెక్కును బ్యాంక్‌లో సమర్పించగా.. అందులో నిధులు లేవని బ్యాంక్ అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు.