శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్లో స్పందిస్తూ… ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్ చేశారు.
OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking.
— Radikaa Sarathkumar (@realradikaa) April 21, 2019